గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రస్తావించకపోవటంపై బడ్జెట్ అమలుపై ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.6,300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు ఉంటే 45 లక్షల మంది రైతులకు రూ. 20 వేల ప్రకారం ఇవ్వలేని పరిస్థితి ఉంది. కేంద్రం ఇచ్చే నిధులతో కూడా సర్దుబాటు చేయలేరు. ఇప్పటికే ఉద్యోగులకు చెల్లించాల్సిన డీవోలు పెండింగ్‌లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. – కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు