శివయ్య లీలలు.. ఎంత వి‘చిత్రమో’ | - | Sakshi
Sakshi News home page

శివయ్య లీలలు.. ఎంత వి‘చిత్రమో’

Feb 26 2025 8:27 AM | Updated on Feb 26 2025 8:22 AM

పురాణాల్లో శివయ్య లీలలు ఎన్నో ఉన్నాయి. వాటిని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు పరమశివుడి గురించి ప్రధాన ఘట్టాలు సూక్ష్మ చిత్రాలుగా ఆవిష్కరించారు. శివుడు యమధర్మరాజు నుండి తన భక్తుడైన మార్కండేయుని కాపాడటం, శ్రీరాముడు రావణాశురుడిని వధించిన తర్వాత బ్రాహ్మణ హత్యాదోశం నుండి విముక్తి పొందాలని శివున్ని పూజిస్తున్నట్లు హనుమంతుడు రామకార్యం విజయవంతం కావాలని శివున్ని ఆరాధిస్తున్నట్లు శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాలేపురుగు, కాల అంటే సర్పం, హస్తీ అంటే ఏనుగు ఈ మూడు జీవాలు భక్తితో శివుడికి పూజ చేయడం లంకాధిపతి రావణాశురుడు శివలింగం వద్ద తపస్సు చేయడం, క్షీర సాగర మదనం నుంచి వచ్చిన విషాన్ని లోక కల్యాణం కోసం శివుడు సేవిస్తుండటం, అర్జునుడు శివున్ని ధ్యాన్నించి పాశుపతాస్త్రం పొందినట్లు, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పరమ శివ భక్తులు శివలింగాన్ని పూజిస్తున్నట్లు, భక్త కన్నప్ప బాణపు మొనతో కంటిని తీసి శివలింగానికి పెట్టడం, కుమారస్వామి, గణపతి స్వాములు ఆది దంపతులు పూజిస్తుండటం, పరమ భక్తులైన అక్క మహాదేవి ఆది శంకరాచార్యులను చిత్రంలో చూపించారు.

– నంద్యాల(అర్బన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement