
అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చిస్తున్న మంత్రి బుగ్గన
బేతంచెర్ల: ప్రజా సంక్షేమంతో పాటు విద్య, వైద్య రంగాలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిఽధిలోని గోరుమానుకొండ గ్రామ సమీపంలోని కర్నూలు ప్రధాన రహదారి పక్కన రూ. 36 కోట్లతో 110 గదులతో నిర్మిస్తున్న బీసీ రెసిడెన్సియల్ బాలుర పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణాలతో పాటు రూ. 4 కోట్లతో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ సెంటర్, రూ. 35 కోట్లతో నిర్మిస్తున్న ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణ పనులను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి బుగ్గన సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. అనంతరం బేతంచెర్ల పట్టణంలో రూ.78 లక్షలతో ఆర్‌అండ్‌బీ ఇన్స్‌పెక్షన్‌బంగ్లా పునరుద్ధరణ పనులను మంత్రి బుగ్గన పరిశీలించారు. భవన నిర్మాణ ఆకృతులలో పలు పనులలో స్వల్ప మార్పులు చేయాలని మంత్రి అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. మంత్రి వెంట నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఏఈ మునిస్వామి, మంత్రి ఓఎస్డీ ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి