306 స్థానాల్లో బీసీలే..
పంచాయతీ పోరులో 165 జనరల్ స్థానాల్లో విజయం
మండలాల వారీగా బీసీలకు లభించిన స్థానాలు
మండలం జీపీలు జనరల్ జనరల్‌లో బీసీ
బీసీ రిజర్వు
నల్లగొండ 31 16 10 07
తిప్పర్తి 26 13 07 07
కనగల్ 31 16 10 08
దేవరకొండ 41 13 05 02
చందంపేట 30 10 04 01
కొండమల్లేపల్లి 27 07 03 02
డిండి 39 14 03 02
నేరడుగొమ్ము 21 04 02 00
చింతపల్లి 36 14 04 07
పీఏపల్లి 25 09 04 03
గుడిపల్లి 12 06 01 01
మిర్యాలగూడ 46 19 03 04
మాడ్గులపల్లి 28 14 07 07
త్రిపురారం 32 15 09 03
దామరచర్ల 35 16 04 00
అడవిదేవులపల్లి 13 05 02 00
వేములపల్లి 12 06 03 03
అనుముల 23 12 00 05
నిడమనూరు 29 15 10 07
తిరుమలగిరిసాగర్ 35 11 03 01
పెద్దవూర 28 12 04 03
గుర్రంపోడు 38 18 10 10
నకిరేకల్ 17 10 09 03
చిట్యాల 18 09 03 06
కేతేపల్లి 16 08 02 04
కట్టంగూర్ 22 06 03 03
నార్కట్‌పల్లి 29 15 08 08
శాలిగౌరారం 24 12 07 06
చండూరు 19 10 07 05
మర్రిగూడ 18 09 06 04
మునుగోడు 28 15 02 08
నాంపల్లి 32 14 06 09
గట్టుప్పల్ 07 04 04 02
మొత్తం 866 377 165 141
ఫ రిజర్వేషన్‌లో 141 స్థానాల్లో
సర్పంచ్‌లు వారే..
ఫ 866 పంచాయతీల్లో
35.33 శాతం బీసీలే గెలుపు
ఫ రిజర్వుడ్ కంటే జనరల్
కేటగిరీలోనే అత్యధికం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలు 35.33 శాతం విజయం సాధించారు. బీసీ రిజర్వేషన్లలో కంటే జనరల్ స్థానాల్లో బీసీలు అత్యధికంగా గెలుపొందారు. ఇటు జనరల్ స్థానాలు, అటు బీసీ రిజర్వు స్థానాలు రెండింటిలో కలిపి జిల్లాలో మొత్తం 35.33 శాతం బీసీ సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నారు.
306 స్థానాల్లో బీసీ ప్రజాప్రతినిధులే..
జిల్లాలో మొత్తం 869 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో మూడు పంచాయతీలు మినహా మిగతా 866 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. అయితే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేస్తామని ప్రకటించినప్పటికి అది అమలుకు నోచుకోలేదు. దీంతో పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో జనరల్‌తో పాటు ఆయా కేటగిరీల వారీగా పంచాయతీల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంలో వచ్చిన రిజర్వేషన్‌ను కచ్చితంగా మార్పు చేయాలని ఎన్నికల సంఘం నిబంధన ఉండడంతో రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేశారు. దీంతో 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన బీసీ రిజర్వేషన్ స్థానాల కంటే ఈసారి బీసీలకు తగ్గిపోయాయి. బీసీ స్థానాలు రొటేషన్ పద్ధతిలో జనరల్‌కు, వివిధ కేటగిరీల వారికి మారిపోయాయి. మొత్తం 869 పంచాయతీల్లో 377 స్థానాలు జనరల్ కేటగిరీకే మారాయి. ఇందులో జనరల్, బీసీ రిజర్వేషన్లలో 306 స్థానాల్లో (35.33 శాతం) బీసీలు విజయం సాధించినట్లయింది.
జనరల్‌లో 43.76 శాతం బీసీలే..
జిల్లాలో జనరల్ స్థానాలు 377 ఉన్నాయి. ఈ స్థానాల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు. ఈ జనరల్ స్థానాల్లో బీసీలు 165 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లుగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో జనరల్ స్థానాల్లో వారు సాధించిన స్థానాలను బట్టి 43.76 శాతం గెలుచుకున్నారు.
బీసీ రిజర్వేషన్లలో 16.28 శాతం గెలుపు..
బీసీలకు రిజర్వు అయిన స్థానాల్లో బీసీలు 141 స్థానాల్లో విజయం సాధించారు. దాంతో 16.28 శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్ స్థానాలు దక్కాయి. ఇటు జనరల్, అటు బీసీ రిజర్వేషన్లలోనూ మొత్తం 306 మంది బీసీ సర్పంచ్‌లు విజయం సాధించడంతో జిల్లాలో 35.33 శాతం స్థానాలు బీసీలకే దక్కినట్లయింది.


