బీజేపీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం
బీజేపీ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా వస్తున్న కాంగ్రెస్ నాయకులు
బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు
నల్లగొండ టూటౌన్ : నేషనల్ హెరాల్డ్ విషయంలో అక్రమ కేసులతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధించడాన్ని నిరసిస్తూ గురువారం నల్లగొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముట్టడించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్న కై లాష్ నేత ముట్టడిస్తామని ప్రటించిన నేపథ్యంలో తమ కార్యాలయంపై దాడికి వస్తే ఎదురుదాడి చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి సైతం ప్రకటించారు. దీంతో బీజేపీ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీగా వెళ్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొంత మంది కార్యకర్తలు కోడి గుడ్లతో అక్కడికి రావడంతో ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యాలయం నుంచి బయటికి రాకుండా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అంతకు ముందే బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డిని ఆయన ఇంటి వద్దనే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్న కై లాష్ నేత, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్ట్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా చైర్మన్ బోడ స్వామి, మాజీ ఎంపీపీ చామల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మర్ల చంద్రారెడ్డి, కసిరెడ్డి నరేష్, ఐఎన్‌టీయూ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న, చిరుమర్తి కృష్ణయ్య, కన్నారావు, పోకల దేవదాసు, గాజుల శ్రీనివాస్, ముంతాజ్‌అలీ, పారిజాత, సుజాత, మల్లేష్‌గౌడ్, ఆరిఫ్, రాజేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నాయకుల చర్యలకు బీజేపీ శ్రేణులు కూడా కార్యాలయంలోనే ఉండి వ్యతిరేక నినాదాలు చేపట్టారు.
ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేకే అక్రమ కేసులు :
డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్
అరెస్టు అయి పోలీస్ స్టేషన్‌కు తరలించిన సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత మాట్లాడుతూ ప్రతి పక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని మోదీ.. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను వాడుకుంటూ ప్రతిపక్షాలను ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్న మోదీని ప్రశ్నిస్తున్న రాహుల్‌పై అక్రమ కేసులు పెట్టిస్తూ వేఽధిస్తున్నారని అన్నారు.
ఫ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
ఫ బీజేపీ శ్రేణులనూ బయటకు రాకుండా కట్టడి
ఫ అంతకుముందే ఇరు పార్టీల అధ్యక్షుల అరెస్టు
బీజేపీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం


