అవసరమున్న ప్రతిరైతుకూ యూరియా
తిప్పర్తి : అవసరమున్న ప్రతి రైతుకూ ఫర్టిలైజర్ యూరియా అవైలబుల్ యాప్ ద్వారా సులువుగా అందనుందని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్ కుమార్ అన్నారు. గురువారం తిప్పర్తి మండలం దుప్పలపల్లి రైతు వేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. యూరియా కొరతను నివారించడానికి ప్రభుత్వం ఈ ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టిందన్నారు. రైతులకు పట్టదారు పాసుపుస్తకాలు ఉంటే సాగుచేసిన పంటలకు ఎంత యూరియా అవసరమో అంత అందిస్తామన్నారు. వరి పంటకు ఎకరానికి రెండు బస్తాలు, మొక్కజొన్నకు ఐదు బస్తాలు, పత్తి ఎకరానికి రెండు బస్తాల చొప్పున సరఫరా చేస్తామన్నారు. ఈ యాప్‌లో వివరాలను నమోదు చేసిన వెంటనే సంబంధిత దుకాణాలకు వెళ్లి యూరియా తీసుకోవచ్చన్నారు. కొత్త యాప్ వల్ల యూరియాను అధిక ధరలకు అమ్మడం.. బ్లాక్ మార్కెట్‌కు తరలించే అవకాశం లేదన్నారు. కార్యక్రమంలో ఏఓ సన్నిరాజు, ఏఈఓలు సంతోషి, రజిత, ఫర్టిలైజర్ డీలర్‌లు యాదగిరిరెడ్డి, శంకర్‌రెడ్డి, రవి, బస్వ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్


