
కాల్వకట్టలు కబ్జామయం!
ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలి
మా పాలెం గ్రామంలోని ఊరకుంటలోకి డీ–53 కాల్వ నుంచి నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం చెరువులోకి వచ్చే కాల్వ కబ్జాకు గురైంది. కాల్వ ఆనవాళ్లు లేకుండా పోయింది. కాల్వ భూములు ఆక్రమణకు గురికాకుండా అధికారులు అడ్డుకట్ట వేఆయలి. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలి.
నోముల కృష్టయ్య,
రైతు, పాలెం, నకిరేకల్ మండలం
కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు
పాలెం గ్రామంలో ఏఎమ్మార్పీ కాల్వను ఇరు వైపులా ఉన్న రైతులు కబ్జాకు పాల్పడినట్లు గుర్తించాం. రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో కాల్వ వెంట ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు ఏర్పాటు చేస్తాం. ఏఎమ్మార్పీ కాల్వ భూములను ఆక్రమించే వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతాం.
– పి.యాదగిరి, తహసీల్దార్, నకిరేకల్
నకిరేకల్: మండల పరిధిలోని ఎస్‌ఎల్‌బీసీ (ఏఎమ్మార్పీ) కాల్వలు కబ్జాకు గురువుతున్నాయి. కాల్వలకు ఇరువైపులా భూమిని ఆక్రమించుకుంటున్న కొందరు రైతులు తమ పట్ట భూముల్లో కలుపుకుంటూ కాల్వ గట్టు వెంట ఎగువ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి దారిలేకుండా చేస్తున్నారు. నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో పాలెం–నోముల వైపు ఉన్న డీ–53 కాల్వకు ఇరువైపులా ఉన్న భూములను ఆక్రమణకు గురయ్యాయని వాటిని కాపాడాలని ఇటీవల గ్రామానికి చెందిన పలువురు రైతులు జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన అధికారులు విచారణ చేయగా కాల్వ భూములు ఆక్రమణకు గురైనట్టుగా నిర్ధారించడంతో కబ్జాల పర్వం వెలుగులోకి వచ్చింది.
కాల్వల నిర్మాణం ఇలా..
జిల్లాలో 136 కిలోమీటర్ల పొడవు ప్రవహించే ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు నకిరేకల్ మండలం చివరిగా ఉంది. నల్లగొండ మున్సిపల్ పరిధిలోని పానగల్ ఉదయ సముద్రం నుంచి నకిరేకల్ మండలం నడిగూడెం వద్ద ఉన్న మూసీ రిజర్వాయర్‌లో ఈ ఏఎమ్మార్పీ కాల్వ కలుస్తుంది. ఈ కాల్వ పరిధిలో నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి మండలాల్లో మొత్తం 30వేల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. డీ–40 నుంచి చివరి డిస్ట్రిబ్యూటరీ డీ–55వరకు మొత్తం 16 డిస్ట్రిబ్యూటరీల ద్వారా ఈ నియోజకవర్గానికి సాగు, తాగు నీరు అందించాలనే లక్ష్యంతో ఈ కాల్వ నిర్మించారు. ఈ కాల్వ పరిధిలోని చెరువులు, కుంటలను నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి బోర్లలో సమృద్ధిగా నీరు లభిస్తుంది.
ఆనవాళ్లు కోల్పోతున్న మైనర్లు
25 ఏళ్ల క్రితం ఏఎమ్మార్పీ కాల్వలను తవ్వారు. అప్పట్లో కాల్వల కోసం అధికారులు పెద్ద ఎత్తున భూసేకరణ చేశారు. భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం కూడా చెల్లించారు. పానగల్ ఉదయ సముద్రం నుంచి కట్టంగూర్ మండలం అయిటిపాముల చెరువు మీదుగా నకిరేకల్ మండలం సరిహద్దులో ఉన్న మూసీ రిజర్వాయర్ వరకు నకిరేకల్, కట్టంగూర్ మండలాల్లో వంద కిలోమీటర్లపైనే కాల్వలు విస్తరించి ఉన్నాయి. ప్రధాన కాల్వతో పాటు సమీపంలోని చెరువులు, కుంటలు నింపేందుకు మైనర్ కాల్వలు నిర్మించారు. అయితే ప్రధాన కాల్వ పక్కన భూములతోపాటు, మైనర్ కాల్వలకు ఇరువైపులా ఉన్న రైతులు కాల్వల భూములను ఆక్రమించారు. నకిరేకల్ మండలం పాలెం, కేతేపల్లి మండలం గుడివాడ చెరువుకు నీరు తీసుకెళ్లే డీ–53 కాల్వకు ఇరువైపులా భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటూ ఆనవాళ్లు లేకుండా చేశారు. ఫలితంగా దిగువన ఉన్న చెరువులు, కుంటల్లో నీటి సరఫరాకు ఆటంకంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ కాల్వదారులను పొలంలో
కలిపేసుకుంటున్న రైతులు
ఫ ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వతోపాటు మైనర్ల కట్టలూ ఆక్రమణ
ఫ కాల్వల వెంట దారిలేకుండా
చేస్తున్న వైనం
ఫ కాల్వ భూములను కాపాడాలని
కలెక్టర్‌కు రైతుల వినతి
ఫ పాలెంలో ఆక్రమణలు గుర్తించిన అధికారులు

కాల్వకట్టలు కబ్జామయం!

కాల్వకట్టలు కబ్జామయం!

కాల్వకట్టలు కబ్జామయం!