పారిశుద్ధ్య సామగ్రి సరఫరాకు టెండర్ల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య సామగ్రి సరఫరాకు టెండర్ల ఆహ్వానం

Jul 21 2025 7:51 AM | Updated on Jul 21 2025 7:51 AM

పారిశుద్ధ్య సామగ్రి  సరఫరాకు టెండర్ల ఆహ్వానం

పారిశుద్ధ్య సామగ్రి సరఫరాకు టెండర్ల ఆహ్వానం

నల్లగొండ : జిల్లాలోని 868 గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు అవసరమయ్యే సామగ్రిని గ్రామ పంచాయతీలకు సరఫరా చేసేందుకు ఆసక్తి గల వారి నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీల్డ్‌ టెండర్లను ఈ నెల 21న ఉదయం 11 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 8074172060 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో గెస్ట్‌ లెక్చరర్లతో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ కె.శ్రీనివాసరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎకనామిక్స్‌ 1, కామర్స్‌ 2, బాటని 1, మైక్రోబయాలజి 1, జువాలజి 3, ఫిజిక్స్‌ 3, కంప్యూటర్‌ సైన్స్‌, అప్లికేషన్స్‌ 6, హిందీ 1, తెలుగు 4, హిస్టరీ (ఉర్దూ) 1, పోలిటికల్‌ సైన్స్‌ (ఉర్దూ) 1 సబ్జెక్టులు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత పీజీలో 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలు అభ్యర్థులు 50 శాతం మార్కులు ఉండాలని తెలిపారు. పీహెచ్‌డీ, నెట్‌, సెట్‌ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని, ఈ నెల 22 నుంచి 25 వరకు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 98490 00244, 94409 12000 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

నేడు దొడ్డా నారాయణరావు సంతాప సభ

చిలుకూరు: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎంపీపీ దొడ్డా నారాయణరావు సంతాప సభ సోమవారం చిలుకూరులోని జరగనుందని సీపీఐ నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దొడ్డా నారాయణరావు శిలాఫలకాన్ని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆవిష్కరించనున్నారని పేర్కొన్నారు. ఈ సంతాప సభకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం ఎమ్మెల్యే కూనంనేని సాంశివరావు తదితరులు హాజరుకానున్నారని తెలిపారు.

ప్రైవేట్‌ టీచర్లు, లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రైవేట్‌ టీచర్లుకు, లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ ఫోరం (టీపీటీఎల్‌ఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుతాన్ని కోరారు. ఆదివారం తిరుమలగిరిలో ప్రైవేట్‌ టీచర్లు, లెక్చరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్‌ టీచర్లు, లెక్చరర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవకాశం కల్పించాలన్నారు. ఇన్సూరెన్స్‌, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు కల్పించి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆ ఫోరం జిల్లా అధ్యక్షుడు నర్సింహారావు, మండల అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి బండారి కిరణ్‌, కోశాధికారి దరావత్‌ భిక్షం, గౌరవ అధ్యక్షుడు పాలబిందెల శేఖర్‌, సహాయ కార్యదర్శి జి.వెంకన్న, బి.భిక్షం, వెంకన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement