
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
నల్లగొండ టూటౌన్ : మహిళలు వ్యాపారాలతో ఆర్థిక సాధికారత సాధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో స్వయం సహాయక మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలపై వారికి అవగాహన కల్పించారు. నిబద్ధతతో వ్యాపారాలను ఏర్పాటు చేసి సమాజంలో పెద్ద వ్యాపార వేత్తలుగా మహిళలు రాణించవచ్చన్నారు. వ్యాపారాల నిర్వహణకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయన్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం, శిక్షణ అందిస్తుందని తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి