భవిత.. భరోసా!
‘ప్రత్యేక’ విద్యార్థులకు చేయూతనిస్తున్న భవిత కేంద్రాలు
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025
నల్లగొండ: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భవిత కేంద్రాలు భరోసానిస్తున్నాయి. సాధారణ విద్యార్థుల తరహాలోనే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తూ.. మానసిక పరిపక్వత కార్యక్రమాలతో వారిలో ఆత్మస్థైర్యం పెంచేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. జిల్లాలోని భవిత కేంద్రాలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక శ్రద్ధచూపుతూ బుద్ధిమాంద్యం, ఇతర దివ్యాంగ, మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులకు ఆయా కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నిత్యం సందర్శిస్తున్నారు.
సమాజంలో గౌరవించబడేలా..
అన్ని అవయవాలు సవ్యంగా ఉంటేనే బతకడం కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ కారణాలతో వైకల్యంతో జన్మించిన పిల్లల పరిస్థితి ఊహించలేనిది. అలాంటి వారిలో ఎక్కువగా మానసిక వైకల్యంతోపాటు ఇతర వైకల్యాలతో జన్మించిన పిల్లల తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అలాంటి పిల్లలు సాధారణ పిల్లల తరహాలోనే విద్యాబుద్ధులు నేర్చుకుని సమాజంలో అందరూ గౌరవించేలా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిత కేంద్రాలను ఏర్పాటు చేశాయి. జిల్లాలో ఉన్న భవిత కేంద్రాల్లో వసతులు కల్పించేందుకు కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి రూ.కోటి 20 లక్షలు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటికే వివిధ సామగ్రి కొనుగోలు, వసతుల కల్పనకు రూ.72 లక్షలు విడుదల చేసి వివిధ పనులు చేపడుతున్నారు.
న్యూస్‌రీల్
అక్రమ డిప్యుటేషన్లు రద్దుచేయాలి
ఫ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి
ఫ సాధారణ విద్యార్థుల తరహాలోనే విద్యాబోధన
ఫ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
ఫ అందంగా ముస్తాబవుతున్న కేంద్రాలు
ఫ కొన్నిచోట్ల కొనసాగుతున్న పనులు
ప్రత్యేక పిల్లలకు చేయూతనివ్వాలి
జిల్లాలో 700 మంది వరకు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలున్నట్లు గుర్తించాం. వారందరూ భవిత కేంద్రాలకు వచ్చేలా తల్లిదండ్రులను ఒప్పిస్తాం. సాధారణ విద్యార్థుల మాదిరిగానే వారికీ విద్యాబుద్ధులు నేర్పే దిశగా ముందుకు సాగుతున్నాం. ప్రత్యేక పిల్లలకు చేయూతనివ్వాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
– ఇలా త్రిపాఠి, కలెక్టర్
జిల్లాలో భవిత కేంద్రాలు 31
‘ప్రత్యేక’ విద్యార్థుల సంఖ్య 459
భవిత.. భరోసా!
భవిత.. భరోసా!
భవిత.. భరోసా!
భవిత.. భరోసా!


