
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నల్లగొండ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ఈనెల 29వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలకు 11376 మంది సాధారణ విద్యార్థులు, 1578 మంది ఒకేషనల్.. మొత్తం 12,954 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఫ హాజరుకానున్న 12954 మంది విద్యార్థులు