● నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేముల వీరేశం 2014లో టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓడిపోయారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో చిరుమర్తి లింగయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన చిరుమర్తి లింగయ్యకు బీఆర్‌ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. దీంతో భంగపాటుకు గురైన వేముల వీరేశం సెప్టెంబర్ 28న కాంగ్రెస్ పార్టీలో చేరారు. నకిరేకల్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది పోటీ పడినా.. చివరకు వేముల వీరేశానికే అధిష్టానం టికెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో ఆయన 68వేల పైచిలుకు మెజార్టీతో చిరుమర్తి లింగయ్యపై ఘన విజయం సాధించారు.