
అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నేతలు
నిడమనూరు: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని తుమ్మడం గ్రామంలో హాథ్ సే హాథ్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ముందుకు స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలంతా శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కె.శంకర్‌నాయక్, నాయకులు యడవెల్లి రంగశాయిరెడ్డి, యడవెల్లి వల్లభరెడ్డి, అంకతి సత్యం, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి