విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు
కందనూలు: విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఈ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపై వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఎస్‌ఈ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యుత్ సిబ్బంది దృష్టికి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. వినియోగదారుల దినోత్సవంలో వివిధ సమస్యలపై 8 దరఖాస్తులు అందాయని.. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఈ శ్రీధర్‌శెట్టి, పార్థసారధి, ఏడీఈ శ్రీనివాసులు, ఏఏఓ సూరంపల్లి సాయిబాబు పాల్గొన్నారు.
ఉపకార వేతనాలు విడుదల చేయాలి
కందనూలు: విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.తారాసింగ్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద విద్యార్థులకు కనీసం స్కాలర్‌షిప్‌లు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ఆరేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను అందించకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిండుకుండలా
రామన్‌పాడు జలాశయం
మదనాపురం: మండల పరిధిలోని రామన్‌పాడు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారింది. సోమవారం నాటికి సముద్రమట్టానికి పైన పూర్తిస్థాయి నీటిమట్టం1,021 అడుగులకు వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 920 క్యూసెక్కులు, సమాంతరంగా 195 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ ద్వారా 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రాసాద్ తెలిపారు.
							విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
