నేడు రన్‌ ఫర్‌ యూనిటీ | - | Sakshi
Sakshi News home page

నేడు రన్‌ ఫర్‌ యూనిటీ

Oct 31 2025 9:01 AM | Updated on Oct 31 2025 9:01 AM

నేడు

నేడు రన్‌ ఫర్‌ యూనిటీ

నాగర్‌కర్నూల్‌ క్రైం: సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఓల్డ్‌ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని విద్యార్థులు, అథ్లెటిక్స్‌ క్రీడాకారులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

డయల్‌ యువర్‌ డీఎం

నాగర్‌కర్నూల్‌ క్రైం: డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం యాదయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమానికి ఫోన్‌ చేసి ప్రజలు, ప్రయాణికులు సలహాలు, సూచనలు అందించి సంస్థ అభివృద్ధికి సహకరించాలన్నారు. డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమానికి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సెల్‌ నం.99592 26288కు ఫోన్‌ చేయాలని సూచించారు.

యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

కందనూలు/ ఉప్పునుంతల: మోంథా తుపానుతో దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు. గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థను సరిచేసి రాత్రిలోగా అన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాలన్నారు. ప్రధానంగా జిల్లా శివారు డిండి పరిధిలోని కంబాలపల్లి, అక్కారం, తెల్దారుపల్లి, చెరుకుపల్లి 33/11 కేవీ సబ్‌ స్టేషన్లకు సంబంధించిన 33 కేవీ ఫీడర్లు దెబ్బతినడంతో సరఫరాలో అంతరాయం కలిగిందని, సిబ్బంది వాటి పునరుద్ధరణ పనులు చేస్తున్నారన్నారు. కంబాలపల్లి, అక్కారం గ్రామాలకు చెందిన 33 కేవీ టవర్లు పూర్తిగా నేలమట్టం కావడంతో సరఫరా పునరుద్ధరణలో కాస్త జాప్యం జరుగుతుందన్నారు. అంతకు ముందు ఉప్పునుంతల మండలంలోని లత్తీపూర్‌ శివారులో ఉన్న డిండి ప్రాజెక్టు అలుగు పారుతున్న ప్రాంతంలో పడిపోయిన స్తంభాలను సీఎండీ ఫారూఖ్‌, సీఈ బాలస్వామి తదితరులు పరిశీలించారు.

చట్టాలపై అవగాహన

పెంచుకోవాలి : ఎస్పీ

నాగర్‌కర్నూల్‌ క్రైం: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే సరైన న్యాయం పొందవచ్చని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలోని ఓల్డ్‌ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే సరైన న్యాయం పొందడంతోపాటు తల్లిదండ్రులు, ఇతరులకు అవగాహన కల్పించాలన్నారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలైన బాంబు డిటెక్షన్‌ టీం, షీటీం, హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ సిస్టం, సైబర్‌ క్రైం పనితీరుపై అవగాహన కల్పించారు. ఎవరికై నా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరైన న్యాయం చేస్తామన్నారు. మానవ అక్రమ రవాణా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో మోసపోకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌బీ సీఐ కనకయ్య, సీసీఎస్‌ సీఐ శంకర్‌, ఆర్‌ఐ జగన్‌, ఎస్‌ఐ గోవర్ధన్‌, ఆర్‌ఎస్‌ఐలు గౌస్‌పాషా, ప్రశాంత్‌, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

నేడు రన్‌ ఫర్‌ యూనిటీ 
1
1/1

నేడు రన్‌ ఫర్‌ యూనిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement