 
															అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నాగర్‌కర్నూల్: జిల్లాలో వర్షాల వల్ల ప్రాణ, పశు, పంట, ఆస్తినష్టం సంభవించకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం అన్నారు. గురువారం తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీసీలో జిల్లా నుంచి అనదపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం హాజరయ్యారు. అనంతరం వారు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి 24 గంటల పరిస్థితిపై రిపోర్టు ఇవ్వాలన్నారు. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అప్రమత్తం చేయాలన్నారు. ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం కలగుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎక్కడ ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మానవత్వం చాటిన
అటవీ సిబ్బంది
మన్ననూర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న చెంచు మహిళను అటవీ శాఖ సిబ్బంది ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. లింగాల మండలం లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ గ్రామంలో గర్భిణి తోకల జగదీశ్వరి రెండు రోజులుగా పురిటి నొప్పులతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డికి అటవీ శాఖ సిబ్బంది ద్వారా సమాచారం అందింది. దీంతో పీఓ, ఎఫ్‌ఆర్‌ఓ వీరేష్ తక్షణమే స్పందించి ఫరహాబాద్ వద్ద ఉన్న సఫారీ వాహనంతోపాటు అటవీ శాఖకు చెందిన ఎఫ్‌బీఓ శిల్ప, మరి కొంత మంది సిబ్బందిని అప్పాపూర్‌కు పంపించారు. గర్భిణికి తోడుగా ఉండే మహిళలను సఫారీ వాహనం ద్వారా మన్ననూర్ గ్రామం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో అచ్చంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు.
● ప్రసూతి కోసం చెంచు మహిళ
ఆస్పత్రికి తరలింపు
 
							అధికారులు అప్రమత్తంగా ఉండాలి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
