
మదనగోపాలస్వామి ఆలయాన్ని సుందరీకరిస్తాం
పెంట్లవెల్లి: జటప్రోల్ గ్రామంలోని మదనగోపాలస్వామి ఆలయాన్ని సుందరీకరించి, భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మంత్రి స్పెషల్ పీఎస్ జయేశ్ రంజన్, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి జటప్రోల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న పురాతన ఆలయాలు, కత్వ వాటర్ ఫాల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జటప్రోల్ గ్రామాన్ని, ఆలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే మదనగోపాలస్వామి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలన్నారు. గ్రామ సమీపంలో ఉన్న కత్వ వాటర్‌ఫాల్స్‌ను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల కోసం సీసీ రోడ్డు వేయించాలని, రైతులకు ఉపయోపడే విధంగా చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోవింద్‌గౌడ్, నల్లపోతుల గోపాల్, భీంరెడ్డి, నాగిరెడ్డి, గుర్క ఆంజనేయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పర్యాటకుల కోసం వసతుల ఏర్పాటు
మంత్రి జూపల్లి కృష్ణారావు