
సందిగ్ధంలో డిగ్రీ విద్యార్థులు
పరీక్షలను బహిష్కరించిన ప్రైవేటు యాజమాన్యాలు
కందనూలు: ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలు విడుదల కాకపోవడంతో ఏప్రిల్‌లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు ఇప్పటికీ నిర్వహించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఈ నెల 6 నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో డిగ్రీ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు కలిపి 17 ఉన్నాయి. ఇందులో 7 ప్రభుత్వ, 10 ప్రైవేట్ కళాశాలలు ఉండగా.. సుమారు 5 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈ విద్యా సంవత్సరం డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, 1, 3, 5 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు చెల్లించే వరకు పరీక్షలు నిర్వహించమని ప్రైవేట్ యాజమాన్యాలు భీష్మించుకొని ఉన్నాయి.
ఫీజు బకాయిలకు.. విద్యార్థుల పరీక్షలకు ముడి పెట్టొద్దని యూనివర్శిటీ అధికారులు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు నచ్చజెప్పుతున్నా ససేమిరా అంటున్నారు. పీజీ, ఇతర ఉన్నత చదువుల ప్రవేశాలకు డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలే కీలకం. డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు త్వరగా రాస్తే వివిధ రకాల పోటీ పరీక్షలకు
ఉన్నత చదువులకు
ఇబ్బందులు..
స్పష్టత లేదు..
మాకు డిగ్రీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది స్పష్టత లేదు. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు వాయిదా వేశారు. మేము పీజీ పరీక్షలకు ప్రిపేర్ కావాలంటే మొదట డిగ్రీ పరీక్షలు పూర్తి కావాలి. దీంతో చాలా ఆందోళనలో ఉన్నాం.
– మల్లేష్‌యాదవ్,
బీఏ, సాధన డిగ్రీ కళాశాల
ఎలా చదువుకోవాలి..
యూనివర్శిటీ అధికారులు ఇలా పరీక్షలు వాయిదా వేసుకుంటూ పోతే మేం ఎలా చదువుకోవాలి. పాలమూరు యూనివర్శిటీ, ప్రభుత్వం మా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇప్పటికై నా సమస్యకు పరిష్కారం చూపి త్వరగా పరీక్షలు జరిపించాలి.
– సాయికిరణ్, బీకాం,
ఆర్ట్స్ డిగ్రీ కళాశాల, నాగర్‌కర్నూల్
ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన పీయూ
పీజీ ప్రవేశ పరీక్షలపై ప్రభావం
చూపుతుందని ఆందోళన
ఖరారు కాని తేదీలు..
పాలమూరు విశ్వవిద్యాలయం గత నెల 23 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించగా.. 28 నుంచి థియరీ పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ప్రైవేటు యాజమాన్యాలు సహకరించకపోవడంతో వాయిదా వేశారు. మళ్లీ ఈ నెల 6 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించినా.. ఆ తర్వాత మళ్లీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కాకపోవడంతో ప్రైవేటు కళాశాలలు గత కొన్ని నెలల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. తాజాగా ప్రైవేటు కళాశాలల పరీక్షలు నిర్వహించమని చెప్పడంతో వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
సిద్ధం కావొచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. కానీ, ఇప్పటికీ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సందిగ్ధంలో డిగ్రీ విద్యార్థులు

సందిగ్ధంలో డిగ్రీ విద్యార్థులు