బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారం స్వామివారికి పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణాచార్యుల బృందం ఆధ్వర్యంలో ఉదయాన్నే హోమశాలలో ప్రత్యేక యజ్ఞం అనంతరం గరుడ పతాక ధ్వజారోహణం జరిపారు. అలాగే సంతాన ప్రాప్తి కోసం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్త దంపతులు ఉపవాస నిష్టతో పల్లకీసేవ అనంతరం పవిత్ర గరుడ ప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రతాప్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, చంద్రారెడ్డి, భాస్కరాచారి, కృష్ణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.