
ఐతోలు టు బాలీవుడ్
‘కల్కి 2898 ఏడీ’ సినిమా దర్శకుడు మనోడే
దర్శకుడిగా మూడో సినిమానే హాలీవుడ్ తరహా చిత్రీకరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రసంశలు అందుకుంటున్న నేపథ్యంలో అందరి దృష్టి నాగ్ అశ్విన్‌పై పడింది. దీంతో సినిమా డైరెక్టర్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లలో ఆసక్తి పెరుగుతోంది. తాడూరు మండలం ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. ఆయన తండ్రి డాక్టర్ సింగిరెడ్డి జయరాంరెడ్డి హైదరాబాద్‌లో యూరాలజిస్ట్‌గా, తల్లి జయంతిరెడ్డి గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. వృత్తిరీత్యా వారు హైదరాబాద్‌కు వెళ్లినా.. గ్రామంలో సొంతిల్లు, దగ్గరి బంధువులు చాలా మందే ఉన్నారు. కుటుంబ, ఇతర శుభకార్యాలు ఉన్నప్పుడు అందరూ ఐతోలుకు వచ్చి వెళుతుంటారు.
నాగ్ అశ్విన్‌ది నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోలు
డైరెక్టర్‌గా ఎవడే సుబ్రమణ్యంతో టాలీవుడ్‌కు పరిచయం
మహానటి చిత్రంతోజాతీయస్థాయిలో గుర్తింపు
ప్రస్తుతం కల్కి సినిమాకు ప్రపంచవ్యాప్తంగాఆదరణ

ఐతోలు టు బాలీవుడ్

ఐతోలు టు బాలీవుడ్

ఐతోలు టు బాలీవుడ్