సేంద్రియ వ్యవసాయ సాగుకు మొగ్గుచూపాలి | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ వ్యవసాయ సాగుకు మొగ్గుచూపాలి

May 5 2026 6:32 AM | Updated on May 5 2026 6:32 AM

మల్హర్‌(కాటారం): రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకొని సేంద్రియ వ్యవసాయం సాగులో ముందుకెళ్లాలని కాటారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పంతకాని తిరుమల అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి నివేదిక రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని కాటారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో తిరుమల మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులంతా అధునాతన సాగు మెలకువలు పాటిస్తూ పెట్టుబడి తగ్గించుకొని అధిక లాభాలు పొందేలా వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని చెప్పారు. అనంతరం మండలంలో భూసార పరీక్షలు నిర్వహించుకున్న రైతులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పూర్ణిమ, తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీఓ బాబు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిషన్‌నాయక్‌, కాటారం సర్పంచ్‌ సడవలి, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement