ములుగు రూరల్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 10న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరికొండ బలరాం, సీతరాం నాయక్, నరేశ్, కృష్ణవేణి, జవహర్ లాల్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


