ప్రజావాణిలో 55, గిరిజన దర్బార్‌లో 15 అర్జీల రాక
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు
భూ సమస్యలు
23
పింఛన్లు
10
ఇందిరమ్మ ఇళ్లు
12
ఇతర సమస్యలు
10
● స్వీకరించిన అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంట
● దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశాలు
వితంతు పింఛన్ అందించాలి
ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. రెండేళ్ల క్రితం నా భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి వితంతు పింఛన్ రావడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి పింఛన్ అందేలా చూడాలి.
– కొలిపాక రమ,
దేవగిరిపట్నం
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు వెల్లువలా వచ్చాయి. భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు తదితర సమస్యలు పరిష్కరించాలని బాధితులు అధికారులకు మొరపెట్టుకున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో 55 అర్జీలు రాగా అదనపు కలెక్టర్ మహేందర్‌జీ ఆర్డీఓ వెంకటేశ్‌తో కలిసి స్వీకరించారు. అదే విధంగా ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో 15 అర్జీలు రాగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంట స్వీకరించారు. అధికారులు బాధితులు అందించిన వినతులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇంటిని రెన్యూవల్ చేయాలి
మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యింది. కుమారుడికి ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రుల చుట్టూ తిరిగి వైద్యం చేయించాం. దీంతో ఇంటి నిర్మాణం చేయలేకపోయాను. అధికారులు ఇందిరమ్మ ఇళ్లు రద్దు అయిందని అంటున్నారు. ఇందిరమ్మ ఇంటిని రెన్యూవల్ చేస్తే ఇంటి నిర్మాణం చేసుకుంటాను.
– బొల్లం రమేశ్, బండారుపల్లి
●


