గిరిజన దర్బార్‌లో వచ్చిన కొన్ని వినతులు.. | - | Sakshi
Sakshi News home page

గిరిజన దర్బార్‌లో వచ్చిన కొన్ని వినతులు..

May 5 2026 6:32 AM | Updated on May 5 2026 6:32 AM

వెంకటాపురం(కె) మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన గిరిజన రైతులు సాగు భూమికి సర్వే నంబర్లు ఉన్నాయని, పట్టాపాస్‌ పుస్తకాలు లేవని తెలిపారు. ఇప్పించాలని వేడుకున్నారు. ఏటూరునాగారం మండలం లంబాడీతండాకు చెందిన ఓ వ్యక్తి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందించాలని విన్నవించారు. ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం పంబాపురంకు చెందిన ఓ మహిళ తన భర్త పేరుపై ఉన్న పోడు పట్టా భూమిని తన పేరుపైకి మార్చాలని కోరారు.

ఏటూరునాగారం మండలం షాపెల్లికి చెందిన గిరిజనుడు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా పాస్‌పుస్తకం పోయిందని కొత్త బుక్‌ ఇప్పించాలని వేడుకున్నారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం ఏజెన్సీ ప్రాంతంలో 1/70 షెడ్యూల్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 222లో గల 15 గుంటల ప్రభుత్వ భూమి అమ్ముకొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరారు. ఏటూరునాగారం మండల పరిధిలోని ఖాళీగా ఉన్న రేషన్‌ దుకాణాల్లో సేల్స్‌మెన్లను నియమించాలని తుడుందెబ్బ మండల అధ్యక్షుడు నీలాద్రి కోరారు. వాజేడు మండలం చెరుకురు గ్రామంలో పంచాయతీ కార్యాలయం పెండింగ్‌ బిల్లులను తక్షణమే చెల్లించాలని కాంట్రాక్టర్‌ మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్‌కుమార్‌, ఎస్‌ఓ సురేశ్‌ బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌, మేనేజర్‌ శ్రీనివాస్‌, జేడీఎం కొండల్‌రావు, జియాలజిస్ట్‌ కిశోర్‌, ఐటీఐ ప్రిన్సిపాల్‌ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement