ములుగు: జిల్లాలోని నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మే 8న ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సిద్ధార్థ రెడ్డితో కలిసి ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఈఈట్, టాస్క్, ఉపాధి కల్పన కార్యాలయాల సమన్వయంతో సుమారు 100 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్‌మేళా సమాచారం ప్రతి ఒక్కరికీ చేరేలా వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాను ఉపయోగిస్తూ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసేవారికి సమాచారం చేరేలా చూడాలన్నారు. టాస్క్‌లో నమోదు చేసుకున్న యువతకు కూడా సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన క్రీడల శాఖ అధికారి బి.రామ్మోహన్, ఉపాధి కార్యాలయ అధికారి కొమురయ్య, పౌర సంబంధాల అధికారి ఎండి.రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్‌జీ


