విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి

May 5 2026 6:32 AM | Updated on May 5 2026 6:32 AM

వెంకటాపురం(కె): గ్రామల్లో నెలకొన్న విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విద్యుత్‌ శాఖ ఏడీఈ ఉమారావు అన్నారు. మండల పరిధిలోని మరికాల గ్రామంలో విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్‌ భద్రత, ప్రమాదాల నివారణపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి అవసరాల కోసం తప్పనిసరిగా నాణ్యమైన విద్యుత్‌ వైర్లను వాడాలన్నారు. పంట పొలాల వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ లైన్లు, తెగిపోయిన వైర్లు కనిపిస్తే తక్షణమే విద్యుత్‌ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకొస్తే సిబ్బంది వాటిని తొలగిస్తారని వివరించారు. అనంతరం మరికాల గ్రామంలోని విద్యుత్‌ సమస్యలను సర్పంచ్‌ కన్నయ్య, ఉప సర్పంచ్‌ రాములు ఏడీఈల కు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ఏఈ హనుమాన్‌ దాస్‌, సిబ్బంది పాషా, ఫరీద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏడీఈ ఉమారావు

Advertisement
 
Advertisement
Advertisement