భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

May 5 2026 6:32 AM | Updated on May 5 2026 6:32 AM

కాళేశ్వరం: ఈనెల 21 నుంచి జూన్‌ 1 వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నామని కాళేశ్వరం దేవస్థానం చైర్మన్‌ అవధాని మోహన్‌శర్మ, ఈఓ మహేష్‌ తెలిపారు. సోమవారం పాలకవర్గం మొదటి సమావేశాన్ని నిర్వహించారు. అంత్య పుష్కరాల నిర్వహణ కోసం పలు తీర్మానాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 12 రోజుల పాటు తాగునీరు, మౌలిక వసతులు ఏర్నాటు చేస్తామన్నారు. స్థానిక భక్తులకు ఉదయం నుంచి 10గంటలకు వరకు దర్శనాలకు అనుమతి ఇస్తామన్నారు. ఈఓ మాట్లాడుతూ..ఆలయంలో భక్తులకు సరిపడా లడ్డు ప్రసాదం తయారు చేస్తామన్నారు. ప్రతీ రోజు భక్తులకు అన్నదానం ఏర్పాటుచేస్తామని తెలిపారు. 12 రోజుల పాటు వీవీఐపీలు, పీఠాధిపతులు రానున్నారని తెలిపారు. హారతి కార్యక్రమానికి కాశీపండితులు వస్తున్నారని పేర్కొన్నారు. వారి వెంట ధర్మకర్తలు సీతారాం, సీతయ్య, సత్యనారాయణ, సత్తయ్య, పద్మ, నర్సయ్య, అశోక్‌, దుర్గయ్య, శ్రీధర్‌రావు, శ్యామ్‌దేవుడా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement