ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు, సబ్జెక్టు నిపుణుల కొరత అడవి బిడ్డలకు అన్యాయం చేస్తున్నాయి. ప్రాజెక్టు మానిటరింగ్ రీసోర్స్ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూమర్‌షిప్ పథకం, ఎంఎస్‌ఎంఈ, పీఎంఈజీపీ పథకం వంటివి అమలుకు నోచుకోవడం లేదు. ఎంఎస్‌ఎంఈ పథకం కింద ఏర్పాటు చేసిన చిన్న తరహా పరిశ్రమలు మూణ్నాళ్లకే మూతపడి మూలుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమకు మిషనరీలు ఇచ్చినా వాటిని ఇప్పటి వరకు అమర్చకుండా వారి ఇళ్ల ఎదుట ఎండలో పెట్టుకోవడం గమనార్హం. అలాగే గిరివికాసం పథకం కింద పోడు భూముల్లో బోర్లు వేశారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి.
ఐటీడీఏ కార్యాలయం


