తూకంలో పారదర్శకత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

తూకంలో పారదర్శకత పాటించాలి

May 4 2026 10:43 AM | Updated on May 4 2026 10:43 AM

టేకుమట్ల: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకంలో పారదర్శకత పాటించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండలంలోని రాఘవారెడ్డి, వెల్లంపల్లి, టేకుమట్ల గ్రామాలలో పీఏసీఎస్‌, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలలోనే లభిస్తుందన్నారు. తూకంలో లోపాలు జరగకుండా ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

పలు పనులకు శంకుస్థాపన

బోర్నపల్లి గ్రామంలో గుట్టు మల్లన్న దేవాలయ నిర్మాణ పనులు, రామకృష్ణాపూర్‌ (వి)లో బీటీ రోడ్డు పనులు, వెలిశాల (కిష్టయ్యపల్లి) నుంచి రామకృష్టాపూర్‌(వి) వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు, వెలిశాల నుంచి రాఘవాపూర్‌ గుట్ట వరకు రోడ్డు నిర్మాణ పనులు, పెద్దంపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement
 
Advertisement
Advertisement