వెంకటాపురం(కె): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. మండల పరిధిలోని పాత్రాపురంలో ఆదివారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమానికి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు


