ఏటూరునాగారం: బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడాలని జిల్లా భరోసా కేంద్రం ఇన్‌చార్జ్, కో ఆర్టినేటర్ అనూష అన్నారు. మండల పరిధిలోని బోరునర్సాపురం, ఏటూరునాగారం, కొండపర్తి గొత్తికోయగుంపు ప్రజలకు మహిళలపై హింసను నిరోధించడం, బాల్య వివాహాల నిర్మూలన, మహిళల భద్రత, లింగ సమానత్వం, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలను శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. బాల్య వివాహాలు చేస్తే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని వివరించారు. సమాజంపై అవగాహన లేకపోవడంతో కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. భరోసా కేంద్రం ద్వారా బాధితులకు అవగాహన కల్పిస్తామన్నారు.


