5న హనుమాన్‌ నగర సంకీర్తన | - | Sakshi
Sakshi News home page

5న హనుమాన్‌ నగర సంకీర్తన

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

ములుగు రూరల్‌: ఈ నెల 5న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అంజన్న స్వామి నగర సంకీర్తనకు హాజరు కావాలని కోరుతూ శనివారం హనుమాన్‌ భక్తమండలి ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు హనుమాన్‌ నగర సంకీర్తన కరపత్రాన్ని అందజేశారు. భక్తిభావంతో సంకీర్తన ఘనంగా నిర్వహంచనున్నట్లు నిర్వహకులు తెలిపారు. హనుమాన్‌ భక్తిబృందం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. రామాలయం దేవస్థానం నుంచి ములుగు పట్టణం మెయిన్‌ రోడ్‌ మీదుగా పురవీధుల గుండా శ్రీ ఆంజనేయ స్వామి శోభాయాత్ర నిర్వహించబడుతుందని తెలిపారు. ఆనంతరం రామాలయ ప్రాంగణంలో 12.30 గుంటలకు హనుమాన్‌ స్వాములకు, భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్‌ భక్తమండలి సభ్యులు ఆవుల ప్రశాంత్‌ రెడ్డి, బాణాల రాజ్‌కుమార్‌, ఒజ్జల కుమారస్వామి, బైకాని నటరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement