వైభవంగా హేమాచలుడి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా హేమాచలుడి రథోత్సవం

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

కనువిందు చేసిన కళాకారుల

నృత్య ప్రదర్శన

మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల రథోత్సవాన్ని ఆలయ ఇన్‌చార్జ్‌ కార్యనిర్వహణ అధికారి ఎం.వీరస్వామి, చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ పర్యవేక్షణలో శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. మల్లూరుగుట్టపై కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గ్రామానికి తీసుకొచ్చి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక రథంపై రాత్రి 9 గంటల నుంచి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన 16 మంది కళాకారులు వివిధ రూపాల వేషధారణతో చేసిన నృత్య ప్రదర్శనలు రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఉత్సవకమిటీ చైర్మన్‌ సురేష్‌, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement