మాలధారుల పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

మాలధారుల పాదయాత్ర

May 2 2026 11:25 AM | Updated on May 2 2026 11:25 AM

ఏటూరునాగారం: మంగపేట మండల పరిధిలోని మల్లూరు గుట్టకు 40 మంది హనుమాన్‌ మాలధారులు గురువారం సాయంత్రం పాదయాత్రగా బయలుదేరారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి హనుమాన్‌ కుటీర స్వాములు 40 మంది పాదయాత్రలో జై శ్రీరామ్‌ జై హనుమాన్‌ అంటూ పాదయాత్ర చేసుకుంటూ గుట్టకు చేరుకున్నారు. హనుమాన్‌ జెండాలను చేతబూని స్వామివారి చెంతకు చేరుకున్నారు. మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి తిరుకల్యాణాన్ని తిలకించి మొక్కులు సమర్పించి తిరుగు ప్రయాణంచేయనున్నట్లు గురుస్వామి గాడిచర్ల సాంబయ్య, గీకురు అనిల్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇర్సవడ్ల సంతోష్‌, మండల నాగరాజు, పోగు రమేశ్‌, శ్రీధర్‌, రమేష్‌, లక్క రమేష్‌, సిద్దు, గంపల శివకుమార్‌, ఉదయ్‌, భిక్షపతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement