పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీ ఏర్పాట్లు

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

భూపాలపల్లి: నీట్‌ నిర్వహణ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన(రేపు) జరుగనున్న నీట్‌ సందర్భంగా 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా నిలవడం నిషేధమని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదన్నారు. మైకులు, డీజేలు వినియోగించడం పూర్తిగా నిషేధమని, పరీక్ష సమయంలో ఇంటర్నెట్‌ సెంటర్లు, జిరాక్స్‌ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వాచీలు తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకురావద్దని సూచించారు. జిల్లా కేంద్రంలోని రెండు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతామని ఎస్పీ సంకీర్త్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement