హక్కులను హరిస్తే గుణపాఠం తప్పదు | - | Sakshi
Sakshi News home page

హక్కులను హరిస్తే గుణపాఠం తప్పదు

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు

సూడి కృష్ణారెడ్డి

గోవిందరావుపేట: కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తే ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి హెచ్చరించారు. సీపీఎం, సీఐటీయూ, ప్రజా సంఘాలు, గ్రామ పంచాయతీ, ఆశ, అంగన్‌వాడీ, భవన నిర్మాణం, ఆటో, హమాలీ సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పస్రా నుంచి చల్వాయి వరకు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చల్వాయి గ్రామంలో నిర్వహించిన సభలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకుచ్చి 129 కార్మిక చట్టాలను సవరించి కార్మికుల హక్కులను హరించిందన్నారు. కనీస వేతనం అమలుకాకుండా పెట్టుబడీ దారి వర్గానికి దోపిడీ సంస్థగా బీజేపీ మారిందన్నారు. ఈ ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని శ్రామిక వర్గం రాజ్యం ద్వారానే కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సోమ మల్లారెడ్డి, పొదిళ్ల చిట్బిబాబు, దుస్స సతీష్‌, ఐలయ్య, జిట్టబోయిన రమేష్‌, అంబాల మురళి, కోటే కృష్ణారావు, గుండు రామస్వామి, కన్నోజు సదానందం, చలసాని వెంకటేశ్వరరావు, తీగల ఆగిరెడ్డి, గొంది రాజేష్‌, కడారి నాగరాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement