మల్హర్(కాటారం): బుద్ధుడి బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శమని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా శుక్రవారం మండలంలోని కాటారం గారేపల్లిలోని జై భీమ్ అంబేడ్కర్ కార్యాలయంలో బుద్ధుడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పి ంచారు ఈ సందర్భంగా పీక కిరణ్ మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడు ధర్మాన్ని సత్యాన్ని న్యాయాన్ని ప్రేమను అందించి ఆచరించి ప్రపంచ మానవాళికి ఆదర్శనీయులయ్యారని చెప్పారు. ప్రతి ఒక్కరూ బుద్ధుడి బోధనల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు సంపత్ మహారాజు, యువైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్, కొండన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.


