గొత్తికోయల సమస్యలు పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

గొత్తికోయల సమస్యలు పరిష్కరిస్తాం

Apr 30 2026 8:43 AM | Updated on Apr 30 2026 8:43 AM

గొత్తికోయల సమస్యలు పరిష్కరిస్తాం

గోవిందరావుపేట : గొత్తికోయ గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పస్రా ఎస్సై తాజుద్దీన్‌ అన్నారు. మండలంలోని కన్నయ్య గొత్తికోయల నివాస ప్రాంతాన్ని బుధవారం టీజీఎస్పీ బలగాలు, పోలీస్‌ సిబ్బందితో కలిసి పస్రా ఎస్సై తాజుద్దీన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాల లబ్ధిపొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గిరిజనులు తమ గోడును వెల్లబోసుకున్నారు. వారి సమస్యలను విన్న ఎస్సై తాజుద్దీన్‌ వెంటనే స్పందిస్తూ, ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడుతామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని, గిరిజనులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement