కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలి

Apr 30 2026 8:43 AM | Updated on Apr 30 2026 8:43 AM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌

ములుగు రూరల్‌: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌ అన్నారు. మండల పరిధిలోని పాల్సబ్‌పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు పద్మదేవ్‌సింగ్‌, నల్లెల స్వాతి, భరత్‌ కుమార్‌, తిరుపతి రెడ్డి, తదితరలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement