సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌గా విద్యావతి | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌గా విద్యావతి

Apr 30 2026 8:43 AM | Updated on Apr 30 2026 8:43 AM

హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు

వెంకటాపురం(ఎం): బీజేపీ మహిళా మోర్చా సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌గా మండల పరిధిలోని నర్సాపూర్‌కు చెందిన పెరుమాండ్ల విద్యావతిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, రాష్ట్ర, జిల్లా నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

రామప్పలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కుటుంబ సమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ భాస్కర్‌ వారిని శాలు వాతో సత్కరించారు. టూరిజం గైడ్‌ విజయ్‌కుమార్‌ ఆలయ విశిష్టత గురించి వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.

భూపాలపల్లి అర్బన్‌: మేడే పోరాట స్ఫూర్తితో కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. 140వ మేడే సందర్భంగా బుధవారం స్థానిక యూనియన్‌ కార్యాలయంలో కరపత్రాల ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ ఓపెన్‌ టెండర్లను వ్యతిరేకిస్తూ సింగరేణి సంస్థను కాపాడుకోవాలని, నాలుగు లేబర్‌ కోడ్ల రద్దు కోసం పోరాటాలు మరింత బలపడాలన్నారు. ఉద్యోగ భద్రతకు కార్మిక వర్గం సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులపై లేబర్‌ కోడ్లు అమలు చేసి పని గంటలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి జనార్దన్‌, కిరణ్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement