మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం చుట్టూ పక్కల ఉన్న అన్ని బంకులు తిరిగినా చుక్క డీజిల్ దొరకలేదు. దుక్కులు దున్నే సమయంలో ట్రాక్టర్‌లో ఇంధనం లేక ఇంటి దగ్గర ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పెట్రోల్ లేక టూవీలర్ మీద తిరిగే పరిస్థితి లేదు. పెట్రోల్, డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
– నల్లెబోయిన సమ్మయ్య, పూసూరు, వాజేడు మండలం
ముప్పనపల్లి వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో ఎప్పుడు స్టాక్ లేదనే బోర్డులే దర్శనమిస్తున్నాయి. వారంలో మూడు రో జులు నోస్టాక్ బోర్డులే పెడుతున్న పరిస్థితి నెలకొంది. స్టాక్ ఉండే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
– దుర్గం రాజు కుమార్, కన్నాయిగూడెం


