బాలల పరిరక్షణపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

బాలల పరిరక్షణపై అవగాహన

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యాలయంలో మంగళవారం బాల్య వివాహాలు, బాలల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో ముత్తమ్మ మాట్లాడారు. బాలికలు తప్పకుండా విద్యను అభ్యసించాలన్నారు. సామాజిక మాద్యమాలకు ఆకర్షితులు కావద్దని సూచించారు. బాల్య వివాహాలు, బాలల పరిరక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో లీగల్‌ కమ్‌ ప్రొహిబిషన్‌ అధికారి సుజాత, తదితరులు పాల్గొన్నారు.

సెంట్రల్‌ యూనివర్సిటీ సందర్శన

ములుగు రూరల్‌: జిల్లా కేంద్రంలోని సమ్మక్క,–సారక్క సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీని మంగళవారం హైదరాబాద్‌ ఎయిమ్స్‌ సీనియర్‌ వైద్యులు రాహుల్‌ నారన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాల వైస్‌ చాన్స్‌లర్‌ శ్రీనివాస్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆరోగ్య సేవలు మెరుగుపడేందుకు యూనివర్సిటీని నోడల్‌ కేంద్రంగా చేసుకొని పలు కార్యక్రమాలు ప్రారంభించాలని ఎయిమ్స్‌ ప్రతిపాధించిందని వెల్లడించారు. ఎయిమ్స్‌ హైదరాబాద్‌, సమ్మక్క,–సారక్క యూనివర్సిటీల మధ్య పరస్పర సహకారానికి అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వివరించారు.

కార్మికుల హక్కులను

కాలరాస్తున్న కేంద్రం

ములుగు రూరల్‌: కార్మికుల హక్కులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తుందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పార్టీ మండల కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను నేడు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్‌ కోడ్స్‌ పేరుతో కార్మికులను అగాధంలోకి నెట్టివేస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పని విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి గపూర్‌ పాషా, రత్నం ప్రవీణ్‌, రాజు, రవీందర్‌, రూప్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement