పట్టణాభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

పట్టణాభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలి

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

ములుగు: ములుగు పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ములుగు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి అన్నారు. ములుగు మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి కమిషనర్‌ అధ్యక్షత వహించగా ఆమె హాజరై మాట్లాడారు. మున్సిపల్‌ నిధుల నుంచి పారిశుద్ధ్య కార్మికుల జీతభత్యాలు, పారిశుద్ధ్య వాహనాల మరమ్మతు, పారిశుద్ధ్య సమస్యలు, ఇంజనీరింగ్‌ విభాగంలో వాటర్‌ సప్లై, చేతిపంపుల రిపేర్లు, వీధి దీపాల సమస్యలపై కౌన్సిలర్లతో చర్చించారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో జిల్లా కేంద్రంలో రోడ్డు వెడల్పునకు సంబంధించిన సర్వే, రెవెన్యూ విభాగానికి సంబంధించి ములుగు పట్టణంలోని గృహ వాణిజ్య, వ్యాపార బిల్డింగ్‌లను కొలతలతో సీజీజీ పోర్టల్‌లో గ్రామ పంచాయతీ రేటుతోనే ఆధునీకరించడంపై చర్చించి సభ్యులు ఏకగ్రీవ తీర్మాణం చేశారు.

కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక

ములుగు మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహించినట్లు కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. తెలంగాణ మున్సిపాలిటీస్‌ కో ఆప్షన్‌ మెంబర్‌ రూల్స్‌ 2020కి అనుగుణంగా పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగి ఉన్న ఇద్దరు సభ్యులు ఓడ సుజాత, కుక్కల నాగరాజును, అల్పా సంఖ్యాక వర్గం నుంచి సయ్యద్‌ ఆసియా, ఎండి.షర్పోద్ధీన్‌లను కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికై నట్లు తెలిపారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చంద్రకళ

Advertisement
 
Advertisement
Advertisement