పలుచోట్ల బ్లాక్‌లో అమ్మకాలు | - | Sakshi
Sakshi News home page

పలుచోట్ల బ్లాక్‌లో అమ్మకాలు

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

పలుచోట్ల బ్లాక్‌లో అమ్మకాలు

జిల్లాలోని ప్రతీ బంకులో నో స్టాక్‌ బోర్డులు పెట్టడంతో వాహనదారులు బ్లాక్‌లో పెట్రోల్‌, డీజిల్‌ను కొనుగోలు చేస్తున్నారు. బంక్‌లలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107, డీజిల్‌ రూ. 95లు ఉండగా సుమారు రూ.130ల నుంచి రూ.150లకు బయట విక్రయిస్తున్నారు. బంక్‌లకు పెట్రోల్‌ రాగానే బ్లాక్‌లో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మే వ్యాపారులు బంక్‌ యజమానులతో కుమ్మకై ్క వాహనదారులకు పోయకుండా వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రబీ సీజన్‌ సందర్భంగా డీజిల్‌ లేక వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు ముందుకు కదలడం లేదు. దీంతో వర్షాలు కురిస్తే తమ పంటల పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే సమయంలో రైతాంగానికి ఇంధన కొరతతో ఇక్కట్లకు గురవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement