గిరిజన దర్బార్‌లో వినతులు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

గిరిజన దర్బార్‌లో వినతులు ఇలా..

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

ములుగు మండలం పొట్లాపురంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అక్కడి గిరిజనులు విన్నవించారు. కన్నాయిగూడెం మండలం పడిగాపురం గ్రామంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా భూమిలో బోరు, మోటారు నిర్మించుకునేందుకు అనుమతి ఇప్పించాలని కోరారు. ఏటూరునాగారం మండలం నుంచి శంకరాజుపల్లికి త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. ములుగు మండలం పొట్లాపురం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సరిగా పనిచేయకపోవడంతో 50 మంది ఆదివాసీ రైతులు సాగునీరు లేక భూములు పడావుపడి ఉంటున్నాయని, ఇరిగేషన్‌ వల్ల నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని కోరారు. ఏటూరునాగారం మండలం ముళ్లకట్టలో హక్కు పత్రాలు ఉన్నప్పటికీ సాగు ఫారెస్టు అధికారులు సాగు చేయనీయడం లేదని విన్నవించారు. తదితర అంశాలను ఏపీఓ పరిశీలించి సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేలా చూస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో డీడీ జనార్దన్‌, ఏఓ రాజ్‌కుమార్‌, ఎస్‌ఓ సురేశ్‌బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌, మేనేజర్‌ శ్రీనివాస్‌, ఎఫ్‌ఆర్‌ఓ రెహమాన్‌, జెడీఎం కొండల్‌రావు, ప్రోగ్రాం ఆఫీసర్‌ మహేందర్‌, జియాలజిస్ట్‌ కిశోర్‌, ఐటీఐ ప్రిన్సిపాల్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement