ములుగు రూరల్/ఏటూరునాగారం: ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని బాధితులు అధికారులను వేడుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో అర్జీలను అదనపు కలెక్టర్ మహేందర్‌జీ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంపత్‌రావుతో కలిసి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా పరిష్కరిస్తూ ఫిర్యాదుదారులకు జవాబుదారిగా ఉండాలన్నారు. ఈ మేరకు ప్రజావాణిలో మొత్తంగా 59 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఐటీడీఏ ఏపీఓ (జనరల్) నాగోరావు అన్నారు. వివిధ సమస్యలపై గిరిజన దర్బార్‌లో ఏపీఓ గిరిజనుల నుంచి 36 వినతులు స్వీకరించినట్లు తెలిపారు.
ప్రజావాణిలో వచ్చిన
వినతుల వివరాలు
గ్రీవెన్స్, గిరిజన దర్బార్‌లో అధికారులకు బాధితుల వేడుకోలు
వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఏపీఓ నాగోరావు
ప్రజావాణిలో 59, గిరిజన దర్బార్‌లో
36 వినతుల రాక
వినతులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశాలు
ఇందిరమ్మ ఇళ్లు 10
పింఛన్లు మంజూరు 27
భూ సమస్యలు 9
ఇతర శాఖలకు 11
ఉపాధి కల్పన 2


