నానో యూరియాపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

నానో యూరియాపై అవగాహన ఉండాలి

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

ఏటూరునాగారం: నానో యూరియాపై రైతులు అవగాహన కలిగి ఉండాలని వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సైంటిస్ట్‌ మధు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ఆత్మ ఆధ్వర్యంలో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఒక రోజు శిక్షణలో భాగంగా సమగ్ర ఎరువుల యజమాన్య పద్ధతిపై అవగాహన పెంచుకోవాలన్నారు. సాయిల్‌ హెల్త్‌ కార్డులు పొందాలని సూచనలు చేశారు. రైతులు కేవలం రసాయన ఎరువులే కాకుండా పశువుల పెంట, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట ఎరువులు, పీఎస్‌బీ(భాస్వరాన్ని కరిగించు భ్యాక్టిరియా), రైజోబియం వంటి జీవన ఎరువులు వాడి మంచి దిగుబడులూ సాధిస్తూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్‌ అరుణ, ఏడీఏ అవినాష్‌వర్మ, ఏఓ వేణుగోపాల్‌, ఏఈఓలు రవికుమార్‌, రాజు, ఉద్యాన అధికారి లావణ్య పాల్గొన్నారు.

సేంద్రియ వ్యవసాయంపై దృష్టిసారించాలి

కన్నాయిగూడెం: మండల రైతులు రసాయణ ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని పెంచే సేంద్రియ ఎరువులతో సేంద్రియ వ్యవపాయంపై దృష్టిసారించాలని వ్యవసాయ శాస్త్ర వేత్త మధు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి ముంజ మహేశ్‌ ఆధ్వర్యంలో పంటల సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రానున్న వర్షాకాలంలో ఎలాంటి పంటలు సాగు చేయాలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వాడాల్సిన ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్త మధు హాజరై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా మధు మాట్లాడుతూ రాబోయే వర్షకాలంలో సన్నరకం వడ్లల్లోని మంచి రకాలను ఎంచుకోవాలని సూచించారు. అనంతరం ఉద్యానవన శాఖ విస్తరణ అధికారి రమేశ్‌ మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ సాగుచేయడం వల్ల అనేక లాభాలు వస్తాయని తెలిపారు.

సైంటిస్ట్‌ మధు

Advertisement
 
Advertisement
Advertisement