డీజిల్‌ కోసం వాహనదారుల క్యూ | - | Sakshi
Sakshi News home page

డీజిల్‌ కోసం వాహనదారుల క్యూ

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

మంగపేట: మండలంలోని వాహనదారులు కమలాపురంలోని గాయత్రి పెట్రోల్‌ బంక్‌లో డీజిల్‌ కోసం ఆదివారం క్యూ కట్టారు. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రంతో పాటు రాజుపేట, కమలాపురంలో మొత్తం ఏడు పెట్రోల్‌ బంక్‌లు ఉన్నాయి. అందులో ఒకటి, రెండు పెట్రోల్‌ బంక్‌లలో పెట్రోల్‌ మాత్రమే అందుబాటులో ఉంది. డీజిల్‌ లేదు. కమలాపురంలోని గాయత్రి పెట్రోల్‌ బంక్‌లో మాత్రమే డీజిల్‌ ఉంది. ఈ క్రమంలో మండలంలో ఎక్కడా డీజిల్‌ లేదని ప్రచారం జరగడంతో పలు గ్రామాల నుంచి రైతులు, హార్వెస్టర్ల యజమానులు, లారీలు, కార్ల యజమానులు డీజిల్‌ కోసం వాహనాలతో తరలివచ్చారు. అలాగే పలువురు క్యాన్లతో తరలివచ్చి గాయత్రి బంక్‌ ఎదుట బారులుదీరారు.

Advertisement
 
Advertisement
Advertisement