నిరుపేదల సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

నిరుపేదల సొంతింటి కల సాకారం

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

ములుగు/ములుగు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో సాకారం చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు ఆదివారం మల్లంపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి మంత్రి హాజరై రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా కేటాయిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ కొండం రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌ ల్యాద శ్యాంరావు, నాయకులు పాల్గొన్నారు.

రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవనం..

జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైస్‌ మి ల్లర్స్‌ ఆసోసియేషన్‌ భవనాన్ని మహబూబాబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి మంత్రి సీతక్క ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రైస్‌ మిల్లర్స్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌, సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రారంభించిన మంత్రి

వెంకటాపురం(ఎం): మండలంలోని జవహర్‌నగర్‌ సమీపంలో గల కోపెల జనార్దన్‌ జ్ఞాపకార్ధం అతని కుమారుడు కోపెల కిరణ్‌ కుమార్‌ నిర్వహిస్తున్న మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా ఫైనల్‌ మ్యాచ్‌ను మంత్రి సీతక్క ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో మంత్రి సీతక్క సరదాగా క్రికెట్‌ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌, కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌ గౌడ్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్‌, డీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ పల్లె జైపాల్‌ రెడ్డి, కౌన్సిలర్‌ గుంటొజు పావని, తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

Advertisement
 
Advertisement
Advertisement