రహదారి పనులు త్వరగా పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

రహదారి పనులు త్వరగా పూర్తిచేయాలి

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

వెంకటాపురం(కె): మండల పరిధిలోని మొరుమూరు నుంచి కర్రె గుట్టల్లోని తడపల వరకు చేపట్టిన రహదారి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఎస్పీ రహదారి పనులను ఆదివారం పరిశీలించారు. రహదారి నిర్మాణ పనుల వద్ద రాత్రింభవళ్లు బందోబస్త్‌ నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బందితో ఎస్పీ మాట్లాడారు. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట ములుగు డీఎస్పీ రవీందర్‌, ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌, వెంకటాపురం(కె) సీఐ రమేశ్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఉన్నారు.

ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌

Advertisement
 
Advertisement
Advertisement